కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అయ్యప్ప పడిపూజ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. హరిహరసుతుడని పంచామృతాలతో అభిషేకించారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మిత్రమండలి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తామని గురుస్వాములు తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, అయ్యప్ప మాలదారుల మణికంఠుని ద్యాసలో మైమరిచిపోయారు.
ఇవీ చూడండి: వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి