ETV Bharat / state

పులిని పట్టుకుంటామంటున్న అధికారులు.. భయాందోళనలో ప్రజలు - పత్తి చేనులో పనిచేస్తుండగా హతం

కుమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దరిని పొట్టనబెట్టుకోవడంతో సమీప గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అడవిలోకి వెళ్తే పులి దాడి చేస్తుందేమో అని మానేసినా.. పులి చేలల్లోకి వచ్చి మనుషులను హతమరుస్తుంటే ఎం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని ఎలాగైనా పట్టుకుంటామని అధికారులు మాటలు చెబుతున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Authorities are trying to catch the tiger People in panic at kumaram bhim district
పులిని పట్టుకుంటామంటున్న అధికారులు.. భయాందోళనలో ప్రజలు
author img

By

Published : Dec 4, 2020, 4:09 PM IST

పులిని పట్టుకుంటామంటున్న అధికారులు.. భయాందోళనలో ప్రజలు

కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడ ఆటవీప్రాంతంలో గతనెల 11న పశువులను మేపడానికి వెళ్లిన విగ్నేష్‌ అనే వ్యక్తిని పులి దాడి చేసి హతమార్చింది. ఆ దారుణ ఘటన మరువకముందే 20 రోజుల అనంతరం పులి మరొకరిని బలి తీసుకుంది. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల అనే బాలిక పత్తి చేనులో పనిచేస్తుండగా.. మాటువేసి దాడిచేసి నోటకరుచుకుని వెళ్ళింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు అప్రమత్తమై పులిని తరిమేశారు. అప్పటికే నిర్మల ప్రాణాలొదిలింది. గత కొన్నేళ్లుగా బెజ్జురు, దహేగాం, పెంచికలపేట అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నప్పటికి అడపాదడపా కనిపించడం పశువులపై దాడి చేయడం పరిపాటిగా మారింది. కానీ ఒకే నెలలో ఇద్దరు మనుషులను చంపడం స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

పట్టుకునేందుకు ప్రయత్నాలు

ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు తెలిపిన అధికారులు.. దాన్ని పట్టుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దాడి చేసిన సమీప ప్రాంతంలో బొన్లను, కెమెరాలను ఏర్పాటు చేసి బందించేందుకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పులి బోన్లలో గాని కెమెరాలకు గాని చిక్కలేదు. పెంచికలపేట అటవీ ప్రాంతం వైపు పయనించినట్లు పాదముద్రలు కనుకొన్న అటవీశాఖ అధికారులు.. అది మహారాష్ట్ర వైపు వెళ్లిందనే నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాత కూడా పులి కదలికలు కనిపించినప్పటికీ అవి కాగజ్​నగర్ డివిజన్ పరిధిలోనివి అని అధికారులు చెప్తూ వస్తున్నారు.

5 లక్షల రూపాయలు

మరోవైపు.. పులి సంచారంతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలకు ధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. పులి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందించి, ఒకరికి అటవీశాఖలో ఉద్యోగం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.

ఇప్పటికే రెండు బొన్లు

మరోసారి పులి పంజా విసరక ముందే దాన్ని బంధించాలని అటవీ శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దిగిడ అటవీ ప్రాంతంలో ఇప్పటికే రెండు బొన్లను ఏర్పాటు చేయగా.. కొండపల్లిలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. వాటిలో మేకలు, పందులను ఎరగా ఉంచారు. పులి కదలికలను పసిగట్టేందుకు ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు.

పులి ఒకే నెలలో ఇద్దరిని బలితీసుకోవడం, సమీప ప్రాంతాల్లో సంచరిస్తుండటం.. భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు.. వీలైనంత త్వరగా పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. పులులు సున్నిత స్వభావం కలిగి ఉంటాయని.. మనుషులు గుంపులుగా కనిపించినా.. అరుపులు కేకలు వినిపించినా, ఎదుటి వారు దాడి చేస్తారని అనిపించినా భయపడి దూరంగా వెళ్లిపోతాయని వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధికారులు అన్నారు.

ఇదీ చూడండి : ఏసీబీ వలకు చిక్కిన ఉప గణాంక అధికారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.