ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివాసీల పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గాదిగూడ, పునగూడ, ధాబా గ్రామాల్లో ఆదివాసీల వివాహాలకు సకుటుంబ సపరివారంగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆదివాసీల పెళ్లి వేడుకల్లో పాల్గొని అందరితో కలిసి డోలు, వాయిద్యాల మధ్య పాటలు పాడుతూ విజిల్స్ వేస్తూ నృత్యాలు చేస్తూ అలరించారు. చిన్నారులతో రేలా రేలా పాటల మధ్య డెమ్సా నృత్యాలు చేశారు.
ఎమ్మెల్యీ చేసిన నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలను చూసిన వారు ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆటపాటలను చూసి సంబురపడిపోతున్నారు. తాను ఓ ఎమ్మెల్యే అయినా సాధారణ ఆదివాసీల వ్యవహరిస్తూ ప్రజల మనిషిగా ఆత్రం సక్కు ఓ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారని కొనియాడారు.
ఇదీ చదవండి: కారులో మంటలు రావడానికి 5 కారణాలివే!