ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!
ఆదివాసీలకు పలువురి నాయకుల పరామర్శ - ఆదీవాసీలు
కుమురం భీం జిల్లా వెంపల్లి కలప డిపోలో ఆశ్రయం పొందుతున్న ఆదీవాసీలను ములుగు ఎమ్మెల్యే సీతక్క, మానవ, పౌర హక్కుల సంఘం నాయకులు, తదితరులు పరామర్శించారు.
ఆదివాసీలకు పలువురి నాయకుల పరామర్శ
కుమురం భీం జిల్లా వెంపల్లి కలప డిపోలో ఆశ్రయం పొందుతున్న కోలం, గొండి ఆదివాసీలను ములుగు ఎమ్మెల్యే సీతక్క, మానవ, పౌర హక్కుల సంఘం నాయకులు పరామర్శించారు. ఆదివాసీలను అడవి నుంచి గెంటివేయడం అధికారుల పైశాచికత్వమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు భుజంగరావు మండిపడ్డారు. ఆదివాసీలకు కోర్టులో కూడా సరైన న్యాయం జరగలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల సహజ జీవన విధానానికి విరుద్ధంగా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని.. మరో ఆరు నెలలు ఇలాగే ఉంటే వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!
sample description