ETV Bharat / state

జవాన్​ కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ - Additional SP Sudhindra visited the Jawan shakeer family

దేశసరిహద్దు లద్దాఖ్​ వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన అమర జవాన్... షాకీర్ హుస్సేన్ కుటుంబాన్ని కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర పరామర్శించారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరారు.

జవాన్​ కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ

author img

By

Published : Oct 23, 2020, 5:49 PM IST

విధి నిర్వహణలో అసువులు బాసిన అమర జవాన్ షాకీర్ హుస్సేన్​ కుటుంబ సభ్యులను కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పరామర్శించారు. కాగజ్​నగర్ పట్టణానికి చెందిన షాకీర్ హుస్సేన్... దేశ సరిహద్దులోని లద్దాఖ్​లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే.

కరోనా కారణంగా అమరజవాన్ షాకీర్ హుస్సేన్... అంత్యక్రియలను లేహ్​లో నిర్వహించారు. ఏఎస్పీ సుధీంద్ర... పట్టణంలోని జవాన్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఘటన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని తెలిపారు. ఆయన వెంట కాగజ్​నగర్ డీఎస్పీ స్వామి, పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, రూరల్ సీఐ అల్లం నరేందర్, ఎస్ఐలు ఉన్నారు.

ఇదీ చూడండి: లద్ధాఖ్​లో కొండ చరియలు విరిగిపడి జవాన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.