కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెండరా గ్రామ సమీపాన రోడ్డు ప్రమాదం సంభవించింది. వాంకిడి మండలం కొత్తదుబ్బగూడెం గ్రామానికి చెందిన భీం రావ్ అతిగా మద్యం సేవించి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలు కావటం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..