కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగూడ గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో శ్రీకాంత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయాలు కావటం వల్ల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాంకిడి మండలం బంబారా గ్రామానికి చెందిన శ్రీకాంత్ కాగజ్ నగర్లో సినిమా చూసి ఇంటికి వస్తున్న క్రమంలో బూరుగూడ వద్ద వెనుక నుంచి వచ్చి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు మంచిర్యాలకు తీసుకెళ్లారు.
ఇవీ చూడండి: పాఠశాలలో విద్యుదాఘాతం... విద్యార్థి మృతి