కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి గ్రామంలో పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. రంగురంగుల వస్త్రాలతో రైతులు తమ ఎడ్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇళ్లలో మట్టితో చేసిన ఎడ్ల బొమ్మలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, డప్పులు భజనలతో నృత్యం చేస్తూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు పాల్గొన్నారు. దివ్య దేవరాజన్ గోండి భాషలో వారితో మాట్లాడుతూ ఎడ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. గిరిజనుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవిస్తానని.. వాటిని తీర్చే విధంగా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఆదాయ మార్గాల్ని అన్వేషించండి :మేయర్