ETV Bharat / state

బెజ్జురు అటవీ ప్రాంతంలో పులి సంచారం.. ఇద్దరు యువకులపై దాడి

బెజ్జురు మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కమ్మర్‌గాం సమీపంలో ఇద్దరు యువకులపై పులి దాడి చేసిన ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తుంది.

a-tiger-attacked-on-two-young-mans-near-kammargam-bejjur-mandal-kumaram-bheem-district
బెజ్జురు అటవీ ప్రాంతంలో పులి సంచారం.. ఇద్దరు యువకులపై దాడి
author img

By

Published : Jul 12, 2020, 10:24 PM IST

కుమురం భీం జిల్లా బెజ్జురు మండలం గుండెపల్లికి చెందిన కుమురం పోచయ్య, మధుకర్ అనే యువకులు బెజ్జురు మండల కేంద్రానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కమ్మర్‌గాం సమీపంలోని మానిక్‌దేవార వద్ద పెద్దపులి ఒక్కసారిగా వాళ్ల ద్విచక్ర వాహనంపైకి దూసుకురావడంతో వాహనం అదుపుతప్పి కింద పడ్డామని తెలిపారు. 'కిందపడి స్వల్ప గాయాలతో ఉన్న మా దగ్గరికి పులి వచ్చింది. మేం భయంతో అలాగే పడుకుని ఉన్నాం. కొద్దిసేపు అక్కడే ఉన్న పులి మా వాసన చూసి వెళ్లిపోయింది' అని యువకులు తెలిపారు.

అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలిని సందర్శించారు. యువకులకు పులి ఎదురైన మాట వాస్తవేమనని తెలిపారు. ఆ యువకులిద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బెజ్జురు ఎఫ్ఆర్ఓ దయాకర్ తెలిపారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: '15 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.