కుమురం భీం జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు రాజస్థాన్ నివాసి అయిన భన్వర్లాల్గా రైల్వేపోలీసులు గుర్తించారు. నవజీవన్ రైలులో అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా... కాగజ్నగర్ రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన భన్వర్లాల్ ఘటన స్థలంలోనే ప్రాణాలొదిలాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు భన్వర్లాల్ కుటుంబీకులకు సమాచారం అందిచారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
కదిలే రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి
ప్రయాణం సాఫీగా సాగిపోతోందనుకున్న ఆ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. గమ్యం చేరకుండానే... జీవితాన్ని ముంగించేశాడు. కదిలే రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అనంతలోకాలకు చేరిపోయాడు. ఈ విషాదం కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో జరిగింది.
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు రాజస్థాన్ నివాసి అయిన భన్వర్లాల్గా రైల్వేపోలీసులు గుర్తించారు. నవజీవన్ రైలులో అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా... కాగజ్నగర్ రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన భన్వర్లాల్ ఘటన స్థలంలోనే ప్రాణాలొదిలాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు భన్వర్లాల్ కుటుంబీకులకు సమాచారం అందిచారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ఇదీ చూడండి: మేడారం ఎఫెక్ట్: ములుగుకు నలభైరోజుల్లో నాలుగో 'సారు'