కుమరం భీం జిల్లా కాజగ్పట్టణంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ కాలానికి చెందిన జమ్మిడి విశాల్ అదే కాలనీకి చెందిన వివేక్ కత్తితో దాడి చేశాడు. మనోహర్ అనే వ్యక్తితో మాట్లాడుతుండగా అతని కొడుకు వివేక్ తనపై కత్తితో దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలతోనే దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'కన్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు'