ETV Bharat / state

భూమి విషయంలో అటవీశాఖ, రైతుల మధ్య వాగ్వాదం - dispute between forest department farmers

ఓ భూమిలో అటవీ శాఖ అధికారులు మెక్కలు నాటడంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. భూమి తమదేనని రైతులు ఆందోళన చేశారు. పోలీసుల చొరవ చూపడంతో వారి మధ్య వాగ్వాదం సద్దుమణిగింది.

A dispute has erupted between forest department farmers in Sirpur U zone of Kumuram Bheem Asifabad district.
అటవీశాఖ రైతుల మధ్య వాగ్వాదం
author img

By

Published : Jun 18, 2021, 10:19 AM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలో అటవీశాఖ రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేవుడుపల్లి వాగు పక్కన గల అటవీ శాఖ భూమి కంపార్ట్మెంట్ 486 సర్వే నంబర్ 9 లో గల సుమారు 12 ఎకరాల భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు ఆ భూమి తమదంటూ అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

పోలీసుల చొరవతో..

సర్వే నంబర్ 9 పూర్తిగా అటవీ శాఖ పరిధిలో ఉండడంతో ఆ స్థలంలో మొక్కలు నాటామని డీఎఫ్ఆర్ఓ శశిధర్ బాబు తెలిపారు. ఆ భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని రైతులకు అంతకుముందే తెలియచేశామన్నారు. రైతుల దగ్గర సరైన భూమి పత్రాలు లేకపోవడంతో మొక్కలు నాటడానికి సిద్ధమైనట్లు శశిధర్ బాబు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై విష్ణువర్ధన్​కు తెలియజేయడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే డీఎఫ్ఆర్ఓ నుంచి అనుమతి పత్రాలు తీసుకురావాలని ఎస్సై రైతులకు సూచించారు. అక్కడితో అటవీ శాఖ అధికారులకు రైతులకు వాగ్వాదం సద్దుమణిగింది.

ఇదీ చూడండి: ఈ రోజు మీ రాశిఫలం గురించి తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.