కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈఘటనలో బాధితుడు వెంకటేష్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ఒక్కసారిగా..
నాయక్ అనుకోడా గ్రామానికి చెందిన వొలికల వెంకటేష్ మేకలు మేపడానికి గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లాడు. వాటిని మేపుతుండగా.. పొదల్లో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా వచ్చి దాడి చేసిందని బాధితుడు తెలిపాడు. బాధితుడి అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని .. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై కాగజ్‌నగర్ అటవీ రేంజ్ అధికారి శివ కుమార్‌ను సంప్రదించగా.. ఎలుగు బంటి దాడి నిజమేనని ధ్రువీకరించారు.
ఇదీ చదవండి:తెలంగాణ వచ్చే వరకు ఒకెత్తు.. ఇప్పుడొకెత్తు: సత్యవతి రాఠోడ్