ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాధితులను జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పరామర్శించారు. గ్రామంలోని ప్రార్థనా మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలుషిత ఆహారం స్వీకరించిన వారిలో 38 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరికొందరికి గ్రామంలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న జడ్పీ ఛైర్మన్ .. గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లారు. పూర్తి స్థాయిలో వైద్యం అందించి అందరూ త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.
ఇదీ చదవండి: వయసు 70 ఏళ్లు... బరిలో 17 సార్లు... 18వ సారి సాగర్ నుంచి...