ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9న నిర్వహించనున్న బహిరంగసభకు సంబంధించిన గోడపత్రికను వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో 33 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ప్రజలు తెలంగాణలో రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని ఆమె పునరుద్ఘాటించారు.
వైఎస్ పాదయాత్ర మొదలుపెట్టింది ఏప్రిల్ 9వ తేదీనేనని... ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. ఏప్రిల్ 9 నుంచే మొదటి అడుగు వేద్దామని ముఖ్యనేతలతో మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎవరూ భయపడవద్దని రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని షర్మిల స్పష్టం చేశారు. ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని తెలిపారు.