ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 20వార్డుల్లో మొదటి రోజు నాలుగు నామినేషన్లు రాగా.. రెండో రోజు 30 మంది నామపత్రాలు దాఖలు చేశారు.
జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి పురపాలక అధికారులు, ఆర్‌వోలకు సూచనలిచ్చారు. పార్టీల నుంచి బీ-ఫారాలు రాకున్నా ఆశావహులు నామపత్రాలు అందజేశారు.
- ఇదీ చదవండి: 'సీఏఏ వల్ల దేశంలో ఎవ్వరికీ నష్టం కలగదు'