ETV Bharat / state

మగువ.. చూపాలి తెగువ..!

అనాగరిక ఛాయలు, పురుషాధిపత్యం నుంచి బయటపడుతున్న స్త్రీ.. సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. ఆ అడుగుల వేగం నెమ్మదిగా ఉండొచ్చు.. కానీ మార్పు విస్పష్టం. జనాభాలో సగం. ఓట్లలో అంతకు మించి. ఆమె దృక్పథం.. సామాజిక పరిణతికి సూచీ. అయినా ఆమెపై నేరాలు ఆగడం లేదు. వైద్య సేవల్లో మెరుగుపడినా విద్యలో వెనుకబాటు, లింగ నిష్పత్తి అంతరాలు దాటినా ఆగని అఘాయిత్యాలు, ఉద్యోగం-ఉపాధుల్లో ఉన్నత స్థాయిలకు పురోగమిస్తున్నా సమాజంలో దక్కని సమ ప్రాధాన్యం.. ఇదీ నేటి వనిత పరిస్థితి. ఇకనైనా మగువ మరింత తెగువ చూపితేనే పురోగతి సాధ్యమని కేంద్ర గణాంకాల శాఖ ‘విమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా-2020’ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం జిల్లాలో పలు రంగాల్లో మహిళల పురోగతిని పరిశీలిస్తే..

women-empowerment-based-story-in-telugu
మగువ.. చూపాలి తెగువ
author img

By

Published : Apr 11, 2021, 2:09 PM IST

షీ బృందాలు ఏర్పాటైనా, కఠిన చట్టాలు తెస్తున్నా నేటి సమాజంలో మహిళలు, బాలలపై అఘాయిత్యాలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు, బయట పరిచయస్థులు, పనిచోట సహోద్యోగులే ఆయా నేరాలకు కారణమవుతుండటం స్త్రీ వివక్షను చాటేదే. చైతన్యవంతమైన కుటుంబాలు ‘అవకాశాల్లో, ఆకాశంలో సగం’ అంటూ బాలికలను ప్రోత్సాహిస్తున్నారు. కానీ వారిపై జరుగుతున్న ఘోరాలు ఏటేటా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. మిగిలిన సమాజంలో మార్పు పూర్తిస్థాయిలో వచ్చినప్పుడే వారిపై వివక్ష సమసిపోతుంది.

ఆగని అఘాయిత్యాలే అవరోధాలు

అందుబాటులో వైద్యం..

క దేశమైనా, అది ప్రాంతమైనా మానవాభివృద్ధిని నిర్దేశించే సూచికల్లో వైద్యం కీలకమైనది. ప్రభుత్వాల చొరవ, అధికారుల కృషితో దవాఖానాలకు వరుసకట్టే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గర్భిణులు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రసవాలు చేయించుకునేందుకు శ్రద్ధ చూపుతుండటంతో మాతా, శిశు మరణాల రేటు గతం కన్నా గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. మన్యంలోని గిరిజనులకు మాత్రం ఇంకా నాటు వైద్యమే దిక్కుగా మారింది. వారి వరకు సేవలు విస్తరిస్తేనే ‘ఓ మహిళా.. సుఖీభవ’ అని దీవించగలం.

తల్లీబిడ్డలు క్షేమం

విద్యావంతులు..

విద్యావంతుల్లో మాత్రం జిల్లాలో మహిళలు వెనుకబాటులో ఉన్నారు. మొత్తం అక్షరాస్యులు 6,38,699 (65.75%) మంది ఉండగా.. వీరిలో పురుషులు 3,51,411, స్త్రీలు 2,87,288 మంది ఉన్నారు. ముఖ్యంగా బాలికా విద్యలో జిల్లా మరింత పురోగతి సాధించాల్సి ఉంది. ఉన్నత పాఠశాల విద్య దాటే సరికి సగటున 40 శాతానికి పైగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎస్టీల్లో ఇది 49 శాతం వరకు ఉంది. అంటే.. గిరిజను బాలికలను విద్యను మరింత చేరువ చేయాలి.

మరింత చేరువ చేయాలి

పనిమంతులు..

మన్యం జిల్లాలో ప్రధాన జీవనోపాధి మార్గం వ్యవసాయం, అనుబంధ రంగాలే. రైతులతో పాటు కూలీల సంఖ్య ఇక్కడ అధికం. ఈ రంగంలో మగవారికి దాదాపు సమానంగా స్త్రీలు కష్టపడుతూ కుటుంబాల్లో కీలకంగా మారారు. వ్యవసాయంలో 30,723, కూలీలుగా 1,42,985 మంది పనిచేస్తూ శ్రమశక్తిని చాటుతున్నారు. జిల్లాలోని కూలీల్లో మహిళలే 23,217 మంది అధికంగా ఉన్నారు. ఇక అన్ని రంగాల్లో 5,17,111 మంది పనిచేస్తుండగా వీరిలో 3,04,501 మంది పురుషులు, 2,12,610 మంది స్త్రీలు ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో వీరి వాటా వరుసగా 61.46 శాతం (5,191), 38.54 శాతం(3,255) ఉంది. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో పురుషులతో ఇంచుమించుసమానంగా సబలలు ఎదుగుతుండటం వారి ప్రాధాన్యాన్ని చాటుతోంది.

ఆమె ఇష్టమే.. మా ఇష్టం..!

చైతన్యం తీసుకురావాలి

ఆడపిల్ల అంటేనే పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనే ధోరణుల నుంచి సమాజం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సగటు వివాహ వయసు పెరగడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, వివాహితుల్లో 18 - 25 సంత్సరాల లోపు వారు సగటున 740 మంది యువతులు ఉంటున్నారు. విద్యావంతులు, ఉపాధి పొందుతున్న వారిలో పెళ్లి ఆలోచనలు చేస్తున్న వారి వయసు 25 ఏళ్లకు మించుతుండగా, వారికి మద్దతిచ్చే కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. మన్యంలో మాత్రం కేవలం నిరక్షరాస్యత వల్లే బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. ఇది మారాలంటే విద్య, ఉపాధి ద్వారా చైతన్యాన్ని పెంపొందించాలని సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సూచిస్తున్నారు.

మరణాల్లో..

ప్రాతినిధ్యం.. చెప్పుచేతల్లో

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుతో మాత్రమే రాజకీయాల్లో మహిళలు కాస్తయినా ప్రాతినిధ్యం కనిపిస్తోంది. స్వతహాగా రాజకీయాలు, ప్రజా సేవపై ఆసక్తి కనబర్చేవారు తక్కువే. రిజర్వేషను, వారసత్వం.. అవకాశం ఎలా వచ్చినా పాలన మగవారి కనుస్నల్లోనే నడుస్తున్న తీరు కనిపిస్తోంది. ఇటీవల కొందరు స్థానిక మహిళా ప్రజాప్రతినిధుల తరఫున వారి భర్తలు సమావేశాలకు హాజరై ఉన్నతాధికారుల ఆగ్రహాన్ని చవిచూడటం విధితమే. రాజకీయాల్లో ప్రాతినిధ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. సర్పంచులు 268, జడ్పీటీసీలు 13, ఎంపీటీసీలు 134, వార్డు సభ్యులుగా 2,112 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆపై స్థానాల్లోనూ రిజర్వేషన్‌ అంశమే స్త్రీ స్థానాన్ని ఖరారు చేస్తోందన్నది నిర్వివాదాంశం.

మన్యం.. పట్టణం.. అంతటా ఆమే

పట్టణమైనా.. పల్లె అయినా జనాభాలో స్త్రీలదే ఆధిపత్యం కొనసాగుతుండటం జిల్లా ప్రత్యేకంగా చెప్పవచ్చు. 7,30,178 మంది పట్టణ జనాభాలో పురుషులు 3,64,807 మంది కాగా మహిళలు 3,65,371. వీరి సంఖ్య 564 ఎక్కువ. గ్రామీణంలో స్త్రీలు మంది ఉండగా.. పురుషుల కన్నా వీరు 3,917 మంది అధికంగా ఉన్నారు. వెనకబడిన తరగతుల్లో మగపిల్లల కోసం ఆసక్తి ఎక్కువనే అభిప్రాయం తిరగబడుతోంది. జిల్లా ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను విశ్లేషిస్తే.. స్త్రీల శాతమే కాస్త ఎక్కువ. ఎస్సీల్లో పురుషులు 71,281 మంది ఉండగా, స్త్రీలు 72,201 మంది ఉన్నారు. జిల్లాలో అధికంగా ఉన్న ఎస్టీల్లోనూ పురుషులు 1,84,351 మంది ఉండగా స్త్రీలు 1,97,683 మంది ఉండటం విశేషం. లింగ నిష్పత్తిలోనూ 1000 మంది పురుషులకు 1082 మంది స్త్రీలు ఉండటం మరో విశేషం. రాష్ట్రస్థాయిలో ఈ అంశంలో ‘భద్రాద్రి’ ముందువరుసలో నిలుస్తోంది.

ఇదీ చూడండి: ఏకకాలంలో రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.