ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్లో మీనా నివాసం ఉంటుంది. ఆమెకు ఒక బాబు, ఒక కూతురు. వారితో పాటు ఓ కాకిని పెంచుకుంటుంది. దాని పేరు వాణి. దానికి టీ తాపిస్తుంది.
అసలు కథ ఏంటంటే..?
రెండు సంవత్సరాల క్రితం... వారి ఇంటి పక్కన ఓ విద్యుత్ స్తంభం ఉంది. దానిపై ఓ కాకి గూడు పెట్టింది. పిల్లలు చేసింది. ఇంతలో తీవ్ర తుపాను వచ్చింది. గాలి వానకు గూడు కాస్త చేదిరింది. తల్లి కాకి చనిపోయింది. గూడు చెదిరి కింద పడటంతో ఆ గూడులోని కాకి పిల్లలు కిందపడ్డాయి. పసిగుడ్డులుగా ఉన్న ఆ కాకి పిల్లలను చూసి మీనా చలించిపోయింది. వాటి పట్ల జాలీ చూపింది. వాటిని రక్షించుకోవాలనికుంది.
మీనాని వదలని రాణి
నాలుగు కాకి పిల్లలను తన ఇంట్లోకి తీసుకువచ్చింది. వాటిని సంరక్షించింది. అందులో 2 పిల్లలు చనిపోయాయి. 2 బతికాయి. అవి పెద్దవి అయ్యాయి. మీనా కుటుంబంలో భాగమయ్యాయి. వాటికి వాణి, రాణి అని పేరు పెట్టుకుంది. ఇటీవల రాణి కాకి దీపావళి రోజున టపాసుల శబ్ధానికి వెళ్లిపోయింది. వాణి మాత్రం మీనాను అంటిపెట్టుకుని ఉంది.
చుట్టుపక్కల వారితో స్నేహం
చుట్టుపక్కల వారు సైతం వాణితో స్నేహం కుదిరింది. చుట్టు పక్కల వారి నివాసాలపై వాలుతోంది. వారితో పాటు గడుపుతుంది. వారు పెట్టే బియ్యపు గింజలు తింటుంది. మీనా వాళ్ల ఇంట్లో వాణి చేసే అల్లరి మాములుగా ఉండదు. మీనా పిల్లలతో కూడా ఆడుకుంటుంది. ఇంట్లో చిన్న చిన్న వస్తువులను తీసుకెళ్లి వారిని ఆట పట్టిస్తుంది. సమయానికి టీ లేకపోయిన ఆహారం లేకపోయిన పోడుస్తుంది. చుట్టు పక్కల వారికి సైతం తన ప్రేమను చూపుతుంది. ఆ వీధిలో అదో కాలక్షేపం.
వాణి అంటే ఆ వీధిలోని వారికి భలే ఇష్టం. పొద్దున లేస్తే.. ఆ వీధిలోని మహిళలకు వాటితోటే కాలక్షేపం. చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకున్న ఆ కాకి.. తనను పెంచిన వారి పట్ల అదే ప్రేమను చూపించటం విశేషం.
- ఇదీ చదవండి : ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం