కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన సమీరా, షోయబ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. గత నెల 6న పెద్ద కుమారుడు అష్రఫ్ సైకిల్‌ను ఓ వ్యాపారి వాహనం ఢీకొట్టింది. వాహన యజమాని వైద్య ఖర్చులు భరిస్తానని తెలిపారు. బాలుని చికిత్సకు లక్ష 50వేల రూపాయలు అయ్యాయి. వ్యాపారి 30 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే తప్పు తమవైపే ఉందంటూ, రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపించారు. వైద్య ఖర్చులు భరించలేక సమీరా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.
ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!