కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఆరెగూడెంలో దారుణ చోటుచేసుకుంది. భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు సంతోష్ అనే వ్యక్తి. గ్రామానికి చెందిన లేకురి లక్ష్మి, సంతోష్ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
భార్య మీద అనుమానంతో ఈ రోజు తెల్లవారుజామున భర్త గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరి మధ్య మనస్పర్థలతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగజ్నగర్ డీఎస్పీ స్వామి ఘటనా స్థలానికి చేరుకొని హత్య ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: దారుణం: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం