ఖమ్మం జిల్లాకు వచ్చిన కొంచెం మొత్తం ఎంఎల్‌ఎస్ పాయింట్లలోనే నిల్వ చేయగా భద్రాద్రి జిల్లాకు అసలే సరఫరా కాలేదు. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం మాత్రం ఏప్రిల్, మే మాసాల్లో ఉచితంగా పంపిణీ చేశారు. అన్నంలో కలుపుకొని తినేందుకు కందిపప్పు ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా నేటికీ లబ్ధిదారులకు దరి చేరలేదు.
ఇంకోపక్క వరుసగా లాక్‌డౌన్ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలిస్తూ, సాధారణ జన జీవనానికి బాటలు వేస్తున్నాయి. నాఫెడ్ ద్వారా ఖమ్మం జిల్లాకు వచ్చిన 900 క్వింటాళ్ల కందిపప్పును ఎంఎల్‌ఎస్ పాయింట్ గోదాములో భద్రపరిచామని, కేటాయించిన మొత్తం వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తామని ఖమ్మం పౌరసరఫరాల శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా ఇక్కడ మాత్రం ఇంకా నిరీక్షణ తప్పడం లేదు.