అధికారులు లేకుండా గ్రామసభలు నిర్వహిచటం వల్ల లాభమేంటని ఖమ్మం జిల్లా ఏన్కూరు గ్రామపంచాయతీలో వార్డు సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై మండలంలో అన్ని చోట్ల గ్రామ సభలు ఏర్పాటు చేయగా... ఏన్కూర్ పంచాయతీలో సభకు కార్యదర్శి ఒక్కరే హాజరయ్యారు. అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టట్లేదని సీపీఐతో పాటు పలు పార్టీల సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఛాంబర్ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ