ETV Bharat / state

విద్యార్థిని మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 15, 2019, 7:33 PM IST

విద్యార్థిని మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

వేసవి సెలవులు ముగించుకొని హాస్టల్​కి వచ్చిన విద్యార్థిని రెండు రోజుల్లో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన నేహ... బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 13న గురుకుల పాఠశాలకు వచ్చింది. 14న ఉదయం వాంతులు అవటం వల్ల హాస్టల్ వార్డెన్, సిబ్బంది నేహకు మజ్జిగ తాగించారు. హాస్టల్లోనే సపర్యలు చేశారు. ఈరోజు ఉదయం నేహ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మరణించింది. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నేహ మృతి చెందిందంటూ బంధువులు, విద్యార్థి సంఘాలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఎదుట ధర్నాకు దిగారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థిని మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

ఇవీ చూడండి: ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్... ముగ్గురు మృతి

Intro:tg_kmm_04_14_vidyardini_mruthi_andolana_ab_c4

( )

వేసవి సెలవులు ముగించుకొని హాస్టల్ కి వచ్చిన విద్యార్థిని రెండు రోజుల్లో లో మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన 8వ తరగతి విద్యార్థిని నేహా 12 ఏళ్లు బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతుంది. వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 13న గురుకుల పాఠశాలకు వచ్చింది. 14 ఉదయం వాంతులు అవటం తో హాస్టల్ వార్డెన్ సిబ్బంది నేహా కు మజ్జిగ తాగించారు. హాస్టల్ లోని సపర్యలు చేశారు. ఈరోజు ఉదయం నేహా పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేహా ఉదయం మరణించింది. దీంతో గురుకుల పాఠశాల ల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నేహ మృతి చెందిందంటూ బంధువులు విద్యార్థి సంఘాలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఎదుట ధర్నాకు దిగారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు....byte
byte... ప్రిన్సిపల్ గురుకులపాఠశాల బోనకల్లు

Body:విద్యార్థిని మృతి ఆందోళన

Conclusion:విద్యార్థిని మృతి ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.