ETV Bharat / state

హాజరు కాలేని విషాద పరిస్థితులు.. బరువెక్కిన హృదయాలు - ఖమ్మంజిల్లా పెదగోపవరం తాజా వార్తలు

మొక్కు తీర్చుకునేందుకు దైవదర్శనానికి వెళ్లి.. ఏపీ​లోని కృష్ణా జిల్లా వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరిన మృతులకు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రమాదంలో మొత్తం మూడు గ్రామాలకు చెందిన వారు మృతి చెందగా... దగ్గరి బంధువులు ఒకరి అంత్యక్రియలకు మరొకరు హాజరుకాలేని విషాద పరిస్థితుల్లో.. బరువెక్కిన హృదయాలతో కుటుంబ సభ్యులకు తుదివీడ్కోలు పలికారు. ప్రమాద ఘటనలో ఎర్రుపాలెం మండలం పెద గోపవరంకు చెందిన ఏడుగురి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించడం గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు మృతుల్లో ఒక్కొక్కరికి తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలు, ఏపీ సర్కారు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.

vidadri accident tragic circumstances of not attending relations attending the funeral
హాజరు కాలేని విషాద పరిస్థితులు..బరువెక్కిన హృదయాలు
author img

By

Published : Jun 18, 2020, 7:48 PM IST

ఒక ఊరిలో ఏడుగురు మృతదేహాలు.. మరో గ్రామంలో ఇద్దరు, ఇంకో గ్రామంలో ముగ్గురు.. ఇలా ఏపీ​లోని కృష్ణా జిల్లా వేదాద్రి రోడ్డు ప్రమాదం మిగిల్చిన తీరని విషాదం.. ఆయా గ్రామాలను శోక సంద్రంలో ముంచెత్తింది. మొక్కు తీర్చుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెదగోపవరంకు చెందిన వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబం, ఆయన బంధువుల కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు శవపరీక్షల తర్వాత స్వగ్రామాలకు చేరుకోగా.. బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

తీరని విషాదం

పెద్దగోపవరంకు చెందిన గోపిరెడ్డి కుటుంబీకుల్లో నలుగురు చనిపోవడం వల్ల ఆ ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన కుటంబీకులను చూసి ఏడ్చేందుకు కూడా ఎవరూ మిగలలేదని బంధువులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోపిరెడ్డి తల్లి పద్మావతి, కుమార్తె ఉదయశ్రీ, ఆయన తాతా, నాయనమ్మ పుల్లారెడ్డి, భారతమ్మల మృతదేహాలతోపాటు గోపిరెడ్డి పెద్దమ్మ, లక్కిరెడ్డి, అప్పమ్మల అంత్యక్రియలు పెదగోపవరంలోని స్మశానవాటికలో నిర్వహించారు. ఒకే గ్రామంలో ఏడుగురి అంత్యక్రియలు నిర్వహించడం వల్ల ఆ గ్రామంలో తీరని విషాదం అలుముకుంది.

జయంతి గ్రామంలో

వెంకటాపురంలో తిరుపతమ్మ అంత్యక్రియలు నిర్వహించగా.. కృష్ణా జిల్లా కొణతాలపల్లిలో రాజేశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదంలో మృతిచెందిన మరో ముగ్గురు బంధువులు సూర్యనారాయణ రెడ్డి, రమణమ్మ, ఉపేందర్ రెడ్డిల అంత్యక్రియలు కృష్ణా జిల్లా జయంతి గ్రామంలో జరిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం వల్ల ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మృతుల కుటుంబాలకు

పెదగోపవరంలో మృతులకు మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, జడ్పీ ఛైర్మన్ కమల్ రాజ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 20 వేల చొప్పున అందజేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి.

2 లక్షల పరిహారం

తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ప్రమాద ఘటన, క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏపీ సర్కారు కృష్ణా జిల్లా జయంతి గ్రామానికి చెందిన ముగ్గురు మృతులతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన 9 మందికి ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించింది.

మరోవైపు.. వేదాద్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మరో 10 మంది ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు ప్రకటించారు.

ఇదీ చూడండి : దశలవారీ సాగుతో కూరగాయల సమస్యకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.