ETV Bharat / state

'రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాల, కొత్త కాచవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ ప్రారంభించారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలని ఆయన కోరారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను అందజేశారు.

vaira mla inaugurated grain purchasing centres
'రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'
author img

By

Published : Dec 4, 2020, 1:37 PM IST

రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాల, కొత్త కాచవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలని ఎమ్మెల్యే కోరారు. రైతుల కోసం రైతుబంధు, బీమా పథకం, సబ్సిడీ యంత్ర పరికరాలు, ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని వెల్లడించారు.

అనంతరం కొణిజర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముప్పై మంది నిరుపేద లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్​ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సరిహద్దుల్లో అక్రమ రవాణా.. మాఫియాగా ఏర్పడి కలప దోపిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.