ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఈదురు గాలులు, మెరుపులతో పడిన వాన రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని మాటూరు, దెందుకూరు, తొండల గోపారం, తోర్లపాడు, చిలుకూరు, రాయపట్నం గ్రామాల్లో వరి, మామిడి, మొక్కజోన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కొన్ని చోట్ల పొలాల్లలో ఉన్న ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి కరెంటు తీగలపై పడటం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి: ఇద్దరి నుంచి 22 మందికి కరోనా.. అన్నీ జీహెచ్ఎంసీలోనే