ఖమ్మం జిల్లా వైరాలో ఆర్టీసీ కార్మికులు 12వ రోజు సమ్మెలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. వీరికి కాంగ్రెస్, తెదేపా, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సత్తుపల్లి- ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఇదీ చదవండిః "సర్కారు స్పందిచలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"