ఖమ్మంలో రూ.25 కోట్లతో నిర్మించే ఐటీ హబ్‌ను నవంబర్లో ప్రారంభిస్తామని టీఎస్ఐఐసీ ఎండీ లక్ష్మారెడ్డి తెలిపారు. స్థానిక పటేల్ స్టేడియం సమీపంలో జరుగుతున్న ఐటీ హబ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయనవెంట ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఉన్నారు. అక్కడ ఇంజినీర్లతో మాట్లాడి తగిన సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజధానిలోనే కాక నగరాల్లోనూ ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఖమ్మంలో ఐటీ హబ్ నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండిః ట్రంప్ చెణుకుకు మోదీ సమాధానమేమిటో తెలుసా!