ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 25 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. జనవరిలో 60 వేల క్వింటాళ్లు, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 25 వేల క్వింటాళ్ల మిర్చి మార్కెట్లో అమ్ముడైంది. సీజన్ ఆరంభంలో క్వింటా మిర్చికి 9 వేల పైచీలుకు ధర పలికితే... ప్రస్తుతం మిర్చి అధికంగా రావడం వల్ల వ్యాపారులు ధరను 6 వేలకు తగ్గించారు. తేమ శాతం ఉందంటూ తక్కువ చెల్లిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మిర్చి కొనబోమంటూ వేధిస్తున్నారని అన్నదాతలు వాపోయారు. రవాణా ఖర్చులు భరించి మార్కెట్ కు వచ్చేకంటే...తమ తమ గ్రామాల్లోనే వ్యాపారులకు మిర్చి అమ్ముకోవడమే మేలంటున్నారు.
మార్కెట్ లో వ్యాపారుల మాయాజాంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి...తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.