ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెరాస నాయకుడు కొనకండ్ల సత్యనారాయణ దీక్షను విరమింప చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా స్థాయి అధికారులు కూడా నిధుల దుర్వినియోగం గుర్తించినప్పటికీ దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీక్షను బలవంతంగా విరమింప చేస్తే గృహంలోనే మరణిస్తానని ఆయన హెచ్చరించారు. ఆయన దీక్షను విరమింపజేసేందుకు వెళ్లిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. సీఐ శ్రీనివాసులు సర్దిచెప్పినా వినకపోవడం వల్ల ఒక దశలో వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.
ఇవీ చూడండి: జోరుగా ఇసుక అక్రమ దందా.. పట్టించుకోని ఆధికారులు !