పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ... ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు మధిరలో ప్రచారం నిర్వహించారు. తెరాస నాయకులతో కలిసి పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.
ప్రశ్నించే నాయకుల కంటే... సమస్యలు పరిష్కరించే నాయకుడు పల్లా గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్ పర్సన్ లత, ఎంపీపీ లలితా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కోరిందల్లా ఇచ్చే ముందు.. ఇవి తెలుసుకోండి!