ఖమ్మం ప్రభుత్వ పీజీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తెరాస, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.
కరోనా నేపథ్యంలో ఓటర్లు భయంభయంగానే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. మాస్కు లేకుండా ఎవరినీ పోలింగ్ కేంద్రంలోకి రానివ్వడం లేదు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రాత్రి కర్ఫ్యూ అనంతర చర్యలు వెల్లడించక పోవడంపై హైకోర్టు అసహనం