ఇటీవల ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఛైర్మన్‌కు రూ.లక్ష జరిమానా విధించారు. నాలుగు నెలలు తిరగక ముందే అంతా మరిచిపోయినట్టే ఉన్నారు. మళ్లీ మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
మంగళవారం పురపాలికలో రైతు వేదికల శంకుస్థాపన కోసం వచ్చిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు స్వాగతం చేప్పేందుకు ప్రధాన రహదారుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశించిన తర్వాత కూడా కార్యకర్తల్లో మార్పు రాకపోవటం వల్ల పట్టణవాసులు ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు.