ETV Bharat / state

మునగాకు పరిశ్రమలో యంత్రాల ట్రయల్​రన్ నిర్వహణ - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల పరిధిలోని మునగాకు పరిశ్రమలో యంత్రాల ట్రయల్​రన్​ను జిల్లా కలెక్టర్ కర్ణన్ ప్రారంభించారు. ఈ పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

Trial run of machines in the industry in khammam, ఖమ్మంలో మునగాకు పరిశ్రమలో యంత్రాల ట్రయల్​రన్
మునగాకు పరిశ్రమను ప్రారంభించిన కలెక్టర్
author img

By

Published : Jan 7, 2021, 5:10 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల పరిధిలోని మునగాకు పరిశ్రమలో యంత్రాల ట్రయల్​రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కర్ణన్, ఐటీడీఏ పీవో గౌతమ్ యంత్రాల ట్రయల్​రన్ ప్రారంభించి, వాటి పనితీరును పరిశీలించారు. ఐటీడీఏ నిధులు, రైతుల సమన్వయంతో రూ.40 లక్షల వ్యయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

మునగాకు పొడిని ఔషధాలు, ఇతర పదార్థాల తయారీకి వినియోగించడంతో మునగ రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రైతులతో పాటు మరి కొంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి షోకాజ్​ నోటీసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.