కార్పొరేషన్ ఎన్నికల్లో పలు కేంద్రాల్లో ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లకు ఇబ్బందులు ఎదురవడంపై మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ... పోలింగ్ సిబ్బంది అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నెస్పీ క్యాంపు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి పువ్వాడ అజయ్.. ఓటర్లను కొంతమంది ఏజెంట్లు నానా ప్రశ్నలు అడుగుతున్నా.. సిబ్బంది పట్టించుకోలేదని నగర పాలక కమిషనర్ అనురాగ్ జయంతి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాల్సిన అధికారులే... ఇలా చేస్తే ఎలా అంటూ కొందరు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'వైరస్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్లే ఊపిరితిత్తులపై ప్రభావం'