ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో ఓ వ్యాపారి.. మిర్చి అమ్మకం దారులను నిండా ముంచాడు. మిర్చిని కొనుగోలు చేసి... రూ. 3 కోట్ల 80 లక్షలు చెల్లించకుండా ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన చింతల సత్యం.. గత పదేళ్లుగా మార్కెట్లో కమిషన్‌దారుల నుంచి మిర్చి కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల కొన్న మిర్చికి సంబంధించి కమిషన్‌దారులకు ఇవ్వాల్సిన రూ. 3 కోట్ల 80 లక్షలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేశాడు. పంచాయితీ పరిష్కారం కోసం బాధితులు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను ఆశ్రయించగా... మంగళవారం డబ్బులు చెల్లిస్తానని వ్యాపారి సత్యం హామీ ఇచ్చాడు. కమీషన్దారులంతా కలిసి వ్యాపారి ఇంటికి వెళ్లగా.. తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే... వ్యాపారితో పాటు ఆయన భార్య పొంతన లేని సమాధానం చెప్పారు. ఆగ్రహించిన కమీషన్ దారులు... అక్కడే టెంట్ వేసుకుని బైఠాయించారు. పదేళ్ల నుంచి నమ్మించి.. మోసం చేశాడని ఆరోపించారు. వ్యాపారి మోసానికి 200 మంది బలయ్యారని... దాదాపు 250 మంది రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని.... మార్కెట్ కమిటీ చొరవ తీసుకుని డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.
ఇవీచూడండి: నిశీధిలో లిల్లీ పూల వేట