ETV Bharat / state

సీతారామ నీటితో పంటలు సస్యశ్యామలం: ఎమ్మెల్యే రాములునాయక్ - వైరా నియోజకవర్గ రైతులకు సీతారామ జలాలు

వైరా నియోజకవర్గంలోని రైతులందరికీ.. సీతారామ జలాలు ఇస్తామని ఎమ్మెల్యే రాములునాయక్‌ పేర్కొన్నారు. ఏన్కూరు, కారేపల్లి మండలాలల్లో జరుగుతున్న ప్రతిపాదిక కాలువ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

To all the farmers in the Vaira constituency .. Sitarama waters
'వ్యవసాయ భూములు ఇక సస్యశ్యామలం'
author img

By

Published : Jun 15, 2020, 8:29 PM IST

సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయని ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, కారేపల్లి మండలాలలో జరుగుతున్న ప్రతిపాదిక కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.

అటవీ ప్రాంతం సందర్శన

కారేపల్లి సమీపంలో అటవీ ప్రాంతాన్ని సందర్శించి కాలువ నిర్మాణం, మ్యాప్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. డీఈలు వెంకన్న, రాందాస్‌లు జూలూరుపాడు మండలం నుంచి కొనసాగనున్న పనులు, పాలేరు జలాశయం వరకు నీటి మళ్లింపు పనులను వివరించారు.

త్వరితగతిన పనులు

సీతారామ జలాలను సాధ్యమైనంత వరకు వైరా నియోజకవర్గంలోని రైతులందరికీ ఇస్తామని ఎమ్మెల్యే రాములునాయక్‌ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని రాములు నాయక్​ తెలిపారు. ఈకార్యక్రమంలో ఏఈ శరత్‌, వైరా మండల తెరాస అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.