ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేసీఆర్ నియంతృత్వానికి ఉద్యమ నిజాయితీకి మధ్య జరిగేవని అన్నారు.
తెలంగాణలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్కు గుత్తేదారుల మీద ఉన్న ప్రేమ.. నిరుద్యోగుల మీద లేదని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ పోలీసు శిక్షణ కేంద్రాలకు అవార్డులు