NTR Lord Krishna Statue dispute in Khammam : ఖమ్మంలో ఈనెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు.. హైకోర్టు అనుమతి నిరాకరించింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం లకారం చెరువులో.. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై భారత యాదవ సమితి, తదితర పిటిషన్లపై.. ఈనెల 18న విచారణ జరిపిన హైకోర్టు.. స్టే ఇచ్చింది. పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-తానా... స్టే ఎత్తివేయాలని కోరింది.
TS HC on NTR Lord Krishna Statue dispute in Khammam : విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నామని తెలిపింది. ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు సర్కారు అనుమతి ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని.. అయితే శ్రీకృష్ణుడి రూపం ఇవ్వడం హిందువులు, యాదవుల మనోభావాలు దెబ్బతీయడమేనని అన్నారు.
Telangana HC on NTR Statue dispute in Khammam : చెరువు మధ్యలో విగ్రహం ఏర్పాటు చేశారని.. రోడ్డు వంటి ప్రజోపయోగ స్థలం కాదు కాబట్టే.. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు అదనపు ఏజీ రామచంద్రరావు తెలిపారు. పిల్లనగ్రోవి, నెమలి పింఛం, తొలగించినట్లు తానా తరఫున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ తెలిపారు. అందరి వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రభుత్వ అనుమతి ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 6కి వాయిదా వేశారు.
అసలేం జరిగిందంటే.. : విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహ ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ప్రారంభ సమయంలోనే ఎలాంటి రాజకీయ కోణాలు లేవని తేల్చి చెప్పారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ప్రత్యేక సాంకేతికతను జోడించి రూ.2.3 కోట్లతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
Khammam NTR Statue dispute : కాగా శ్రీ కృష్ణుని రూపంలో ఉండడం వల్ల విగ్రహ ఏర్పాటుకు అంతరాయాలు కలిగాయి. ఈ రూపంలో నిర్మించడం వల్ల హిందువులు. యాదవులు మనోభావాలు దెబ్బతింటాయని యాదవుల తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విగ్రహావిష్కరణపై హైకోర్టు మే 18వ తేదీన స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి విచారణ చేపట్టి తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: