ETV Bharat / state

కోట్లు విలువ చేసే తరుణి హట్​ భూముల విషయంలో సర్కారు నిర్లక్ష్యం! ఎందుకు ఇలా? - కోట్లు పలుకుతున్న తరుణి భూములు

Tharuni hut lands in khammam: డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి కోసం.. రెండు దశాబ్దాల కిందట ఖమ్మం నడిబొడ్డున కేటాయించిన తరుణి హట్ భూములు.. లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచాయి. కోట్ల విలువైన భూముల్ని కేటాయించినప్పటికీ.. నిర్వహణ గాలి కొదిలేయడం, అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకుండా పోవడంతో.. అతీగతీ లేకుండా పోయింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన నిర్మాణాలు.. శిథిలావస్థకు చేరుతుండగా.. అసలు లక్ష్యం నీరుగారింది.

tharuni lands
తరుణీ హట్​ భూములు
author img

By

Published : Dec 10, 2022, 5:31 PM IST

నిరుపయోగంగా తరుణి హట్​ ల్యాండ్స్​

Tharuni hut lands in khammam: ఖమ్మం గ్రామీణం మండలం పరిధిలోని ఏదులాపురం రెవెన్యూ పరిధిలోని తరుణి హట్ భూముల విలువ ప్రస్తుతం కోట్లల్లోనే ఉంటుంది. ఖమ్మం నగరం చుట్టూ విస్తరించడం.. బహుళ అంతస్తులు విపరీతంగా నిర్మించడంతో గ్రామీణ మండలంలోని చాలా ప్రాంతాలు.. నగరాన్ని తాకుతున్నాయి. ఇదే కోవలోనే తరుణి హట్ భూముల విలువ కోట్లల్లోనే ఉంటుంది. 2002లో అప్పటి ప్రభుత్వం మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. చేయూతనిచ్చేలా తరుణి హట్ కొలువుదీరింది.

7ఎకరాల స్థలం కేటాయించగా.. 2 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. కేంద్రం నుంచి కొంత నిధులు మంజూరయ్యాయి. 7 క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టర్​లో 9 స్టాల్స్ నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ నిర్మించిన 20 కుటీరాలు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఫుడ్​ స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు శిక్షణ నిచ్చేందుకు భవనాలు, సమావేశాల కోసం ప్రత్యేక వేదిక.. ఇలా అన్ని రకాల ఏర్పాట్లతో.. తరుణి హట్ కొలువుదీరింది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ నిచ్చేందుకు తరుణిహట్​లో ప్రత్యేకంగా భవనాలు నిర్మించారు. కొంతకాలం పాటు మహిళలకు శిక్షణా కార్యక్రమాలు జరిగినా.. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత నిరుపయోగంగా మారింది. మహిళల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతోపాటు.. ఆ తర్వాత ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవడంతో తరుణిహాట్ మరుగున పడింది.

2002లో తరుణి హట్ నెలకొల్పినా ఆ తర్వాత కొన్నేళ్లకే నిరుపయోగంగా మారింది. 2005 నుంచి 2007 వరకు ఈ ప్రాంతంలోనే స్తంభాద్రి ఉత్సవాల పేరిట జరిగిన సంబురాలు వైభవంగా సాగాయి. కొంత భూమి ఆర్మీ బలగాలకు కేటాయించారు. మరికొంత స్థలం గ్రామీణ నిరుద్యోగ స్వయం ఉపాధి శిక్షణ సంస్థకు అప్పగించారు. మిగిలిన దాదాపు 6 ఎకరాల స్థలం నిరుపయోగంగా మారింది. ఎకరం కోట్ల రూపాయల్లో ధర పలికే స్థలం ఎందుకు పనికిరాకుండా పోతోంది. గతంలో ఖమ్మం నగరానికి ఆధునిక బస్టాండ్​లు ఇక్కడే నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా.. కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం కేటాయించాలని చూసినా.. ముందడుగు పడలేదు. ఖమ్మం గ్రామీణం తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా.. బుట్టదాఖలయ్యాయి. దీంతో ప్రస్తుతం అత్యంత విలువైన భూమి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. తరుణి హట్​లో నిర్మాణాలన్నీ శిథిలావస్థకు చేరాయి.

"తరుణి హట్​ అనేది మహిళా గ్రూపుల స్వావలంబన, ఆర్థికంగా ఎదగడానికి శిక్షణలు ఇవ్వడం గురించి నిర్మించడం జరిగింది. ప్రస్తుతం వాటిని ఉపయోగించకపోవడం వల్ల నిరూపయోగంగా పడి ఉన్నాయి. ఈ స్థలం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందుకు సంబంధించిన ప్లాన్​ కలెక్టర్​ దగ్గర ఉంది. త్వరలోనే ప్రభుత్వం పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం." - మధుసూదన్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.