ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు అందించి, రైతుబంధు, రైతుబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీమా పుస్తకాలలో ఉన్న తప్పులను వెంటనే సవరించాలన్నారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ ఎన్నికల హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: నగరానికి పండుగ శోభ.. లష్కర్ బోనాలు షురూ..