నూతన సంవత్సరం మొదటిరోజుని పురస్కరించుకుని ఖమ్మంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. స్తంభాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి గుట్ట కింద వరకు భక్తులు బారులు తీరారు. నగరంలోని ఇందిరానగర్ రామాలయం, జలాంజనేయస్వామి ఆలయం, గుంటుమల్లేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
- ఈ కథనం చూడండి: హ్యాపీ న్యూయర్ అంటూ మదిని మైమరపించే పూల బొకేలు