కొంత మంది నాయకులు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ సర్కార్.. రైతు పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుసని, ప్రతిపక్ష పార్టీలు తెలుసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఖమ్మం నగరంలో పర్యటించిన మంత్రి పువ్వాడ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల ఖమ్మం పాత రైతు బజార్‌ను మూసివేయడం వల్ల.. అత్యాధునిక వసతులతో నూతనంగా రైతుబజార్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
- ఇదీ చదవండి : బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు.. క్షీణిస్తున్న ఆరోగ్యం