ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్ నియంత్రణలోనే ఉందని.. రాబోయే రోజుల్లో మరింత కట్టుదిట్టంగా వైరస్‌కు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనిచేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం ఖమ్మం జిల్లాలోనే ఒకేసారి దాదాపు వెయ్యి మందికి అత్యవసర వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను సన్నద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు. ఉభయ జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, ఆక్సిజన్, రెమ్‌డెసివర్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు హైపవర్ కమిటీలు పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు.
కరోనా వైద్యం పేరిట బాధితుల నుంచి కాసులు దండుకునే ప్రైవేటు ఆస్పత్రులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదన్న మంత్రి పువ్వాడ..అలాంటి ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రతిరోజు ప్రైవేటు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టేలా ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. కొవిడ్‌కు భయపడితే మరింత భయపెడుతుందని.. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. తాను రెండుసార్లు కరోనాను జయించానని.. మిగిలిన బాధితులంతా ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చదవండి ఈటలా.. రాజీనామా చెయ్.. తేల్చుకుందాం: గంగుల