Harish Rao Khammam Visit : ఖమ్మం జిల్లాలో రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రెండో రోజు పర్యటిస్తున్నారు. సత్తుపల్లి మండలం నారాయణపురంలో శ్రీషిర్డి సాయి ఆస్పత్రి నిర్మాణానికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. షిర్డీసాయి జనమంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 కోట్లతో 250 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న ట్రస్టు సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Harish Rao Khammam Tour : సంక్షేమానికి చిరునామా తెరాస ప్రభుత్వమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి కల్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు ఇచ్చామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఆస్పత్రిలో సిబ్బందిని సైతం పెంచుతామన్న హరీశ్... కావాల్సిన వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డయాలసిస్ రోగులకు చికిత్స అందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. సత్తుపల్లిలోనూ డయాలిస్ కేంద్రం ఏర్పాటు చేశామన్న మంత్రి.. మరో ఐదు మిషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Harish Rao on Telangana Schemes : 'తెలంగాణలో అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ఏదోరకంగా ప్రతి ఇంటికి పథకాలు చేరుతున్నాయి. ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం కింద చేయూతనిస్తున్నాం. ఇప్పుడు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నూతన ఆస్పత్రులు నిర్మిస్తున్నాం.'
- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి
Harish Rao Khammam Tour News : సత్తుపల్లి మండలం పాకలగూడెంలో మాజీ మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి హరీశ్ రావు సందర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా తుమ్మల ఇంట్లో బస చేసిన హరీశ్ రావు.. ఆయన వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ తోటకు వెళ్లారు. పామాయిల్ సాగు పద్ధతులు, లాభాలపై హరీశ్ రావుకు తుమ్మల వివరించారు.
Harish Rao Visit in Kothagudem : కొత్తగూడెంలో కొత్తగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. 100 పడకల కేంద్రాన్ని రూ.20 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 52 శాతం పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గిందని హరీశ్ రావు తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలన్నారు. నిబంధనలతోనే మూడోదశ నుంచి బయటపడతామని స్పష్టం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!