తెలంగాణ కోసం అన్ని విధాలుగా పోరాడానని ఖమ్మం తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూశాకే కేసీఆర్తో నడవాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. తెదేపాతోనే తన జీవితం మొదలైందని .. అక్కడ ఎంత కష్టించి చంద్రబాబుకు దగ్గరయ్యానో తెరాసలోనూ అదేవిధంగా పనిచేస్తానని తెలిపారు. ఈవీఎంలో తన పేరు చూశాక ఏ తెదేపా కార్యకర్త కూడా వేరే వారికి ఓటేయరని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:హస్తంను వీడి... కారెక్కుతున్న సునీతా..!