ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో సురభి నాటకాలు ప్రారంభమయ్యాయి. సురభి నాటకాల 135వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారం రోజులపాటు నిర్వహించే ఈ నాటకాల్లో మొదటగా భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించారు. సాంకేతిక పరిజ్ఞానంతో... ఆధునిక హంగులు అద్దుతూ నటులు నాటకాన్ని అద్భుతంగా రక్తి కట్టించారు. అనంతరం పద్యాలతో ప్రేక్షకులను అలరించారు.
ఇవీ చూడండి: 'అదనంగా ఒక్క రూపాయి ఖర్చు చేయొద్దు'