ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌జెండర్ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇన్నాళ్లు ప్రభుత్వాలు తమను చిన్న చూపు చూశాయని, తమకు గౌరవ ప్రదమైన జీవితం కావాలని కొరుకుంటున్నామని తెలిపారు. తాము చదువుల్లో రాణిస్తున్నామని..రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల 24న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం వినతి పత్రాలు ఇచ్చి, తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.
ఇవీ చూడండి : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం