Horoscope Today December 5th 2024 : డిసెంబర్ 5వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా వుంటుంది. కుటుంబ కలహాలు సద్దుమణుగుతాయి. వృత్తి పరంగా చేపట్టే ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. ఇంటి అలంకరణ గురించి అధిక ధనవ్యయం చేస్తారు. మాతృవర్గం నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఉద్యోగస్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగరీత్యా దూర ప్రదేశాలకు, విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తారాబలం అనుకూలంగా వుంది. అందుకే కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్థులు ఏదైనా కొత్త వెంచర్ మొదలు పెట్టడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు. తీర్థ యాత్రా సందర్శన వలన ఆధ్యాత్మిక ప్రేరణ పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శుభకరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధ పడేవారికి శస్త్ర చికిత్సలు జరిగే అవకాశముంది. కుటుంబ విషయాలలో దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అజాగ్రత్త నష్టానికి దారితీయవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈరోజు అనుకూలం ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. వృత్తిపరంగా, ఆర్థికంగా లాభపడతారు. స్నేహితులు, ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్థులు భాగస్వాముల నుంచి ప్రయోజనం పొందవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొని సమాజంలో గౌరవం పొందుతారు. ఈశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలం లేదు. గ్రహ సంచారం అనుకూలం లేనందున వృత్తి వ్యాపారాలలో మెరుగైన ఫలితాలు రావడం కష్టతరం అవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ మనోబలమే మీకు శ్రీరామరక్ష. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ రోజు విద్యార్ధులకు కఠినంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో నష్టభయం ఉంది. అందుకే పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన సమావేశాలు, మేధోపరమైన చర్చలలో పాల్గొనకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పట్ల మీ నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. రుణభారం పెరగవచ్చు. తల్లిగారి ఆరోగ్యం ఆందోళనగా కలిగిస్తుంది. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం అనుకూలం కాదు. ఏ పని చేసినా ముందు వెనుక ఆలోచించి చేయండి. వృత్తి వ్యాపారాలలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ప్రయంత్నపూర్వకంగా అందరినీ కలుపుకొని పోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మనశ్శాంతిగా ఉంటుంది.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. అభయ ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన సమావేశాలు లాభదాయకంగా ఉంటాయి. మీరు చేసే వాదనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ధన లాభాలు పొందుతారు. మీ పిల్లలకు సంబంధించి శుభవార్తను వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం కోసం వివిధ ప్రదేశాలకు వెళ్తారు. వృత్తి పరంగా, ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం ఉత్తమం.