ETV Bharat / entertainment

నార్త్​లో షూటింగ్! - 29 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్​పై రజనీ, ఆమిర్​! - RAJINIKANTH COOLIE MOVIE

కూలీ కోసం ఆమిర్, రజనీకాంత్ - 29 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్​పై!

Aamir Khan Coolie Movie
Coolie Movie (ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 7:18 AM IST

Aamir Khan Coolie Movie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్​, డైరెక్టర్​ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'కూలీ'. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎక్స్​పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, తాజాగా బాలీవుడ్‌ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా 'కూలీ' కొత్త షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ఆమిర్‌ జయపుర్​ వెళ్లినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్​లో రజనీ అలాగే ఆమిర్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే గతంలోనే ఆమిర్ ఈ సినిమాలో నటించనున్నట్లు టాక్ వచ్చినప్పటికీ మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ రూమర్స్ నిజమే అని అభిమానులు అంటున్నారు.

మరోవైపు డిసెంబర్ 12న రజనీ బర్త్​డే స్పెషల్​గా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఆమిర్‌ పాత్రపై క్లారిటీ రావొచ్చని సినీ వర్గాల మాట. ఇక రజనీ - ఆమిర్‌ చివరిసారిగా 29ఏళ్ల క్రితం వచ్చిన 'ఆటంక్‌ హై ఆటంక్‌' సినిమాలో కలిసి సందడి చేశారు.

ఇక 'కూలీ' సినిమా విషయానికి వస్తే, బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఓ స్టోరీని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2025 సమ్మర్​కు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ రివీల్ వీడియోలో వచ్చిన బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను తెగ ఆకట్టుకుంది.

ఆ సెంటిమెంట్​తో రిలీజ్!
అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్​కి సంబంధించిన ఓ రూమర్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. వచ్చే ఏడాది మార్చికి థియేటర్లలోకి రాబోతుందని అందరూ అనుకోగా, ఇప్పుడు ఈ సినిమా కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1 న విడుదల కానుందట. మూవీ పేరుకు తగ్గట్లుగా, ఆ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కూడా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

'కూలి' నాగార్జున వైల్డ్​ లుక్​ షూటింగ్​ వీడియో లీక్​ - రోలెక్స్​ తరహాలో క్రూరంగా చంపేస్తూ! - Coolie Nagarjuna Video Leaked

'రజనీ వల్లే ఆ రెండు సినిమాలు చేశా - ఈ రేంజ్​ క్రేజ్ అస్సలు ఊహించలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.